“Nobody has Dhoni's nerve for finishing off victories. Many times I've thought, 'He's left it too late this time', only to be amazed as he produced a couple of powerful shots to bring India a nail-biting victory,” Says Ian Chappell.
#MSDhoni
#IanChappell
#ViratKohli
#IndiavsAustralia
#rohithsharma
#dineshkarthik
#sunilgavaskar
వన్డేలను విజయవంతంగా ముగించడంలో ధోని తర్వాతే ఎవరైనా అని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికీ అతడిని మించినవారు ఎవరూ లేరని, ఇప్పటికీ అతనే 'బెస్ట్ ఫినిషర్' అని చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు.
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో చాపెల్ మాట్లాడుతూ "చివరి వరకు నిలిచి జట్టును గెలిపించడంలో ధోని అంత సమర్థంగా ఎవరూ ఒత్తిడిని జయించలేరు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇక కష్టం అనిపించినప్పుడల్లా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి అతను లెక్క సరి చేస్తాడు. ఉత్కంఠభరిత క్షణాల్లో తన వ్యూహానికి అనుగుణంగా ప్రశాంతంగా ఆడటం చూస్తే అతని బుర్ర ఎంత పక్కాగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు" అని అన్నాడు.